Skip to main content

Namaste NRI

అడివి శేష్‌, శృతిహాసన్‌ డకాయిట్ టైటిల్‌ టీజర్ వ‌చ్చేసింది

అడివి శేష్‌, శృతిహాసన్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న తాజా చిత్రం డకాయిట్. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణ లో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. షానీల్‌ డియో దర్శకుడు. హిందీ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి  టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక టీజ‌ర్ చూస్తే బ‌ద్ద‌ శత్రువులుగా మారిన ప్రేమికుల కథ అని తెలుస్తుంది. ఈ టీజర్‌ ద్వారా మేకర్స్‌ ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ప్రేక్షకులు బిగ్‌స్క్రీన్‌పై ఎన్నడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమాలో చూస్తారని అడివిశేషు చెప్పారు. షానీల్‌ డియో విజన్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉంటుందని, దేశంలోని అరుదైన ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాల నేపథ్యంలో సరికొత్త అనుభూతిని పంచేలా బరువైన పాత్రలతో ైస్టెలిష్‌ ఎంటర్‌టైనర్‌గా షానిల్‌ డియో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నారని అడివిశేషు అన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News