Skip to main content

Namaste NRI

ఉడిపిలో తండేల్ షూటింగ్ షురూ

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న క్రేజీ మూవీ తండేల్.  ఇందులో చైతూ జోడిగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీ కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈరోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఉడిపిలో ప్రారంభించారు.

పాత్రధారులంతా పాల్గొనే ఈ కీలక షెడ్యూల్‌లో కొంత టాకీతోపాటు యాక్షన్‌ పార్ట్‌ కూడా చిత్రీకరించను న్నారు. ప్రస్తుతం షూటింగ్‌ కర్ణాటకలోని మాల్సే పోర్ట్‌(ఉడిపి)లో జరుగుతున్నది. నాగచైతన్య, ఫైటర్స్‌పై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగచైతన్య ఇందులో మత్యకారుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న యదార్థగాథని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, సమర్పణ: అల్లు అరవింద్‌.

Social Share Spread Message

Latest News