Namaste NRI

డోనాల్డ్ ట్రంప్‌కు షాక్‌…అధ్యక్ష పదవికి అన‌ర్హుడు

అమెరికాలోని కొల‌రాడో రాష్ట్రానికి చెందిన అత్యున్న‌త న్యాయ‌స్థానం మాజీ దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కు షాకిచ్చింది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్‌ను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించింది. స్ట‌న్నింగ్ తీర్పును ఇచ్చిన కొల‌రాడో సుప్రీంకోర్టు దేశ రాజ్యాంగంలోని 14వ స‌వ‌ర‌ణ‌ ప్ర‌కారం ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పింది. ఈ తీర్పుతో కొల‌రాడో రాష్ట్రంలో ట్రంప్ త‌న రిప‌బ్లిక‌న్‌ పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి అన‌ర్హుడ య్యారు. కొల‌రాడో కోర్టు అసాధార‌ణ రీతిలో 4-3 తేడాతో తీర్పును వెలువ‌రించింది. 2021, జ‌న‌వ‌రి ఆరో తేదీన జ‌రిగిన క్యాపిట‌ల్ హిల్ అటాక్ కేసులో కొల‌రాడో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అయితే జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు ఆ తీర్పుపై స్టే ఇచ్చారు. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడానికి ట్రంప్‌నకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న వ్యక్తిని న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటించడం ఇదే ప్రథమం.

Social Share Spread Message

Latest News