లొకేషన్ షేర్ చేయడానికి థర్డ్ పార్టీ (వాట్సాప్, టెలిగ్రాం)యాప్‌ల అవసరం లేకుండా గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. రియల్ టైం లొకేషన్ వివరాల తోపాటు, స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ స్టేటస్ కూడా ఇందులో కనపడుతుందని పేర్కొన్నాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే అడ్రస్ డిస్క్రిప్టర్స్ ను గత నెలలో గూగుల్ మ్యాప్స్‌లో ప్రవేశపెట్టారు. నగరం లోపల, శివారు ప్రాంతా ల్లో లొకేషన్‌ను కనుగొనేందుకు ఇదెంతగానో దోహదపడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనికి కొత్త అప్‌డేట్‌ను చేర్చుతూ సరికొత్త ఫీచర్ లొకేషన్ షేరింగ్ ను తీసుకొచ్చింది.