అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట నేవార్క్‌లోని స్వామినారాయణ్ మందిర్‌పై దాడి ఘటనను మరువకముందే మళ్లీ అలాంటి ఘటన చోటుచేసుకున్నది. తాజాగా కాలిఫోర్నియాలోని షెరావాలి ఆలయంపై దాడి జరిగింది. ఆలయ గోడలపై కొందరు ఖలిస్థాన్ అనుకూల రాతలు రాశారు. విషయం తెలిసిన హిందూ అమెరికన్ ఫౌండేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. మోదీ టెర్రరిస్ట్ ఖలిస్తానీ జిందాబాద్ అని రాశారు. గోడలపై గ్రాఫిటీ రాతలకు చెందిన ఫోటోలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. ఒక్క అమెరికాలోనే కాదు కెనడా, ఆస్ట్రేలియా, యూకేల్లోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై ఖలిస్తానీ తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే.
