అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మళ్లీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన హిండెన్‌బర్గ్ రిపోర్టుతో ఆవిరైపోయిన అదానీ సంపద, తిరిగి పుంజుకు న్నది. ఈ క్రమంలోనే ఇన్నాళ్లూ భారతీయ శ్రీమంతుడిగా కొనసాగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి మరోసారి అదానీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా జాబితా ప్రకారం అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ముకేశ్ అంబానీ 97 బిలియన్ డాలర్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. దీంతో భారత్‌లోనేగాక, ఆసియా దేశాల్లోనూ అపర కుబేరుడు గౌతమ్ అదానీయేనని తేలింది.