నాగార్జున హీరోగా నా సామిరంగ చిత్రంతో ఈ సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. విజయ్ బిన్ని దర్శకుడు. ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్, అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ తదితరులు నటిస్తున్నారు. విడు దల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇటీవల విడుదల చేసిన టైటిల్ సాంగ్ మాస్ నెంబర్‌గా ఆకట్టుకోగా, తాజాగా దేవుడే తన చేతితో అనే మూడో గీతాన్ని విడుదల చేశారు. నాగార్జున, అల్లరి నరేష్‌ల మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఆవిష్కరిస్తూ హృదయానికి హత్తుకునేలా ఈ పాట సాగింది. బాల్యం నుంచి వారి మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని చూపిస్తూ అర్థవంతమైన సాహి త్యంతో ఆకట్టుకుంది. స్వీయ స్వరకల్పనలో ఎం.ఎం.కీరవాణి రాసిన ఈ గీతాన్ని శాండిల్య ఆలపించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిం చారు. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరథి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, దర్శకత్వం: విజయ్ బిన్ని.
