జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడుకి చెందిన వేల్స్ యూనివర్సిటీ జనసేనానికి డాక్టరేట్ ప్రకటించింది. ఈ మేరకు తమ యూనివర్సిటీ 14వ కాన్వకేషన్ కార్యక్రమా నికి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ ను ఆహ్వానించారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం యూనివర్సిటీ ప్రకటించిన పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించారు. వివిధ రంగాలలో గొప్పగా రాణించిన ప్రతిభావంతులైన వ్యక్తులు చాలా మంది ఉన్నారని, అలాంటి వారికి డాక్టరేట్ ఇవ్వాలని కోరారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వేల్స్ యూనివర్సిటీకి లేఖ రాశారు. ఆ లేఖ లో వేల్స్ యూనివర్సిటీ తనను గౌరవ డాక్టరేట్ కి ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా కాన్వకేషన్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నారు.
