ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాకు పోటీగా లో మరో భవనం నిర్మాణం జరుపుకుంటున్నది. ప్రపంచం అబ్బురపడేలా అత్యంత ఎత్తైన, ఆకర్షణీయమైన కొత్త భవనాన్ని 1.23 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.10వేల కోట్లు) ఖర్చు చేసి జెడ్డా ఎకనమిక్ కంపెనీ నిర్మిస్తు న్నది. జెడ్డా టవర్స్ గా పిలుస్తున్న ఈ భవనం ఎత్తు 1000 మీటర్లు ఉంటుందని తెలిసింది. అంటే భూమి నుంచి ఆకాశంలో ఒక కిలోమీటరు ఎత్తు అన్నమాట. దుబాయ్ నడిబొడ్డున 2010లో నిర్మించిన బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు. ఇది గత 14 ఏండ్లుగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా కొనసాగుతున్నది. ప్రపంచ పర్యాటకానికి, వ్యాపారానికి, సంపదకు దుబాయ్‌ను కేంద్రంగా మార్చటంలో ఈ భవనం కీలకంగా మారింది.