అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీ, ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ హోటల్‌లో తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టి విజయవంతంగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భంగా పోచంపల్లి తిరుపతి రెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అభిమానులు సమావే శం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ముప్పై రోజుల ప్రజాపాలన భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, జనరంజకమైన పాలనతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలొ ప్రయాణించాలని ఆకాంక్షిం చారు. మూడు నెలలలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది సోదరులు ఎనుముల జగదీశ్ రెడ్డితో పాటు, పోచంపల్లి తిరుపతి రెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి, బొందుగుల జగదీశ్ రెడ్డి, మాదవరం నాగేందర్, బువనేశ్ బుజాల, అమర్ బొజ్జా, ప్రొద్దుటూరి రమణారెడ్డి, రవి బొజ్జా, అజయ్ గంజి, శ్రవణ్ పాడూరి, విజయపాల్ పైళ్ళ, వేణు నక్షత్రం, శ్రీనివాస్ తాటిపాములతో పాటు, సుమారు మూడు వందల మందికి పైగా ఎన్నారైలు హాజరయ్యారు.