Namaste NRI

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుదల

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను అసెంబ్లీ కార్యాలయం విడుదల చేసింది. కాగా, రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరు గానే నోటిఫికేషన్లను జారీ చేసింది. నేటి నుంచే నామినేష్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది . ఈనెల 18 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న నామినేషన్ల‌ పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈనెల 29న పోలింగ్‌ జరగనుంది. అదే రోజున ఫలితాలు వెలువడ నున్నాయి. అయితే, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్‌ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నది. అయితే రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో సంఖ్యాబలం దృష్ట్యా అధికార కాంగ్రెస్‌ పార్టీకే ఆ సీట్లు దక్కనున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events