చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం హనీమూన్ ఎక్స్‌ప్రెస్. బాల రాజశేఖరుని దర్శకుడు. కెకె ఆర్, బాలరాజ్ నిర్మాతలు. తనికెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రల్లో కనిపిస్తారు. అరవింద్‌కృష్ణ, అలీ, సురేఖవాణి, రవివర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలోని నిజమా అనే గీతాన్ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ విడుదల చేశారు. కల్యాణి మాలిక్ స్వరపరచిన ఈ పాటను సునీత ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ రామ్‌గోపాల్‌వర్మ సినిమాలకు దర్శకత్వం శాఖలో పనిచేశాను. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ఓ ప్రేమ జంట ప్రయాణానికి దృశ్యరూపంలా ఆకట్టుకుంటుంది. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, ఆర్ట్: శిష్టా విఎమ్‌కే, సంగీతం: కల్యాణి మాలిక్, దర్శకత్వం: బాల రాజశేఖరుని.