భరత్, నవీన రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం బిఫోర్ మ్యారేజ్.శ్రీధర్ రెడ్డి దర్శకత్వం. ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకుడు మట్లాడుతూ న్యూఏజ్ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. పెళ్లికి ముందు చేసే కొన్ని పొరపాట్ల వల్ల జీవితం అనూహ్య మలుపులు తీసుకుంటుంది. ఇదే అంశాన్ని ఈ సినిమాలో చూపించాం. లవ్, రొమాన్స్‌తో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది అన్నారు. యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశామని నిర్మాత ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 26న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్ రెడ్డి, సంగీతం: పీఆర్, దర్శకత్వం:శ్రీధర్ రెడ్డి.