రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పురుషోత్తముడు. రామ్ భీమన దర్శకత్వం. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. హాసిని సుధీర్, మురళీశర్మ, కౌసల్య, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామా ఇది. రాజ్‌తరుణ్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. గోపీసుందర్ స్వరపరచిన పాటలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: గోపీ సుందర్, రచన-దర్శకత్వం: రామ్ భీమన.