ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. హిందీ భాషాభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తోన్న విశ్వహిందీ పరిషత్తు ఆచార్య యార్లగడ్డను అమెరికా, కెనడా దేశాలకు హిందీ భాషా సమన్వయకర్తగా నియమించింది. అక్కడి ఔత్సాహికులకు హిందీ నేర్చుకోవటంలో ఆయన ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. నెల రోజుల కెనడా చేరుకుని అక్కడ కూడా హిందీపై అధ్యయానికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో హిందీ పరిషత్తు నేతృత్వంలో సంయోజకుడు విపన్ కుమార్ యార్లగడ్డకు ఢల్లీిలో స్వాగతం పలికి జ్ఞాపిక, శాలుతో సత్కరించారు.