Namaste NRI

రాబిన్‌హుడ్ గా వస్తున్న నితిన్

హీరో నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రాబిన్‌ హుడ్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై  రూపొందుతోంది. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  గణతంత్ర దినోత్సవం సందర్భంగా టైటిల్‌ రివీల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. భారతీయులందరూ తన సోదరులు, సోదరీ మణులుగా భావించి, వారి నుంచి డబ్బు దొంగిలించడానికి తనకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పే నితిన్‌ పాత్రను పరిచయం చేస్తూ రివీల్‌ చేసిన టైటిల్‌ గ్లింప్స్‌ ఆకట్టుకుంది. డబ్బు చాలా చెడ్డది. రూపాయీ రూపాయీ నువ్వేం చేస్తావ్‌ అంటే, అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాను అంటది. అన్నట్టే చేసింది.

దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు, ఆభరణాలేసుకున్నోళ్లంతా నా అక్కా చెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే.. ఫ్యామిలీ మెంబర్‌ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు. అయినా నేను హర్ట్‌ అవ్వలేదు. ఎందుకంటే అయినవాళ్ల దగ్గర డబ్బులు తీయడం నా హక్కు. మై బేసిక్‌ రైట్‌. బికాజ్‌ ఇండియా ఈజ్‌ మై కంట్రీ. ఆల్‌ ఇండియన్స్‌ ఆర్‌ మై బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ అంటూ సాగే హ్యూమర్స్‌ డైలాగ్‌తో నితిన్‌ తనను తాను పరిచయం చేసుకోవడం ఆసక్తికరంగా ఉంది ఈ చిత్రా నికి కెమెరా: సాయిరాం, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events