ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ చైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ (74) మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని బెర్నార్డ్ దక్కించుకున్నట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. ఆర్నాల్ట్, ఆయన కుటుంబం ఆస్తి ఈ ఏడాది 23.6 బిలియన్ డాలర్లు పెరిగి 207.8 బిలియన్ డాలర్లుకు చేరుకో గా, మస్క్ సంపద 204.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బెర్నార్డ్ మొదటిసారి 2022లో కూడా మస్క్‌ను అధిగమించి తొలి స్థానాన్ని దక్కించుకున్నారు.