సౌదీ అరేబియాలోని జెద్దాలో భారత కాన్సుల్ జనరల్‌గా తెలుగు యువ దౌత్యవేత్త ఫహాద్ అహ్మద్ సూరీ నియమితులయ్యారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఫహాద్ అహ్మద్ సూరీ ప్రస్తుతం వాణిజ్య మంత్రిత్వ శాఖలో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రీకా దేశాలతో భారత ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. కర్నూలు నగరంలోని ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన ఫహాద్ స్థానిక జి.పుల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో చదివారు. ఆ తర్వాత బెంగుళూరులో ఎంబీఏ చేసి లండన్‌లో బ్యాంకర్‌గా పని చేసిన అనంతరం సివిల్స్ పరిక్షలో ఐ.యఫ్.యస్‌కు ఎంపికయ్యారు.
అంతకుముందు ఆయన కువైత్‌లోని భారతీయ ఎంబసీలో పనిచేసారు. అరబ్బీ భాషాలో అనర్గళంగా మాట్లాడే ఆయనకు వర్కాహలిక్‌గా పేరుంది. రాజకీయ, సైనిక, లక్షలాది మంది హాజ్ యాత్రికుల రాకపోకల దృష్ట్యా జెద్దాలోని కాన్సుల్ జనరల్ పోస్టింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటివరకు జెద్దాలో పని చేసిన షాహీద్ ఆలంను లండన్‌లోని భారతీయ హైకమీషన్‌కు బదిలీ చేసారు.