జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి తెర పడింది. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస పరీక్షలో చంపై సోరెన్ సర్కార్ విజయం సాధించింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస పరీక్షలో జార్ఖండ్ సర్కార్ నెగ్గింది. అంతకు ముందు శాసనసభలో చంపై సోరెన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో స్పీకర్ ఓటింగ్ చేపట్టారు. ఇందులో 47 మంది చంపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. కాగా . హెమంగ్ సోరెన్ సిఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం చంపై ముఖ్యమంత్రగా బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ ఆదేశాల మేరకు నేడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో చంపై విజయం సాధించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)