ఎవరెస్ట్ పర్వతారోహకులకు కొత్త నిబంధన విధించారు. ఇకపై పర్వతంపై విసర్జించిన మలాన్ని ప్రత్యేక సంచుల్లో బేస్ క్యాంప్‌కు తీసుకురావాలి. ఆ సంచులను విధిగా తనిఖీ చేస్తారు. పర్వతారోహకుల మల విసర్జ నలతో ఎవరెస్ట్ శిఖరం కంపు కొడుతున్నది. విపరీతంగా పేరుకుపోతున్న మల, ఇతర వ్యర్థాల వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ పర్వత్వానికి చెందిన నేపాల్‌లోని పసాంగ్ లాము గ్రామీణ మున్సిపా లిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఆ మున్సిపాలిటీ చైర్మన్ మింగ్మా షెర్పా ఈ కొత్త నిర్ణయం గురించి మాట్లాడారు. విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా పర్వతాలపై మల విసర్జన పూర్తిగా క్షీణించదని తెలిపారు. దీంతో పర్వతాల్లో దుర్వాసన వస్తున్నదని చెప్పారు. దీనివల్ల కొంత మంది పర్వతారోహకులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని అన్నారు. ఈ పరిస్థితి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్న ఆయన, తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని, పొరుగున ఉన్న మౌంట్ లోట్సేను అధిరోహించా లనుకునే వ్యక్తులు రసాయనాలతో కూడిన ప్రత్యేక మల సంచులను బేస్ క్యాంప్‌లో కొనుగోలు చేయాలని మింగ్మా షెర్పా తెలిపారు. వారు బేస్ క్యాంప్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆ మల సంచులను తనిఖీ చేస్తారని చెప్పారు. ఈ చర్య ద్వారా ఎవరెస్ట్ పర్వతాలపై మల విసర్జాలను నివారించి అక్కడి పర్యావరణాన్ని కాపాడుతామని ఆయన అన్నారు.