నిర్మాత కంఠమనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం రాజధాని ఫైల్స్. భాను దర్శకుడు. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీవిశ్వనాథ్ ప్రధాన పాత్రధారులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా వేల ఎకరాలు ఇచ్చి హేళన పాలై, క్షోభకు గురైన వేలాది రైతుల ఆవేదన, పోరాటాల స్పూర్తితో ఓ సినిమా చేయాలని అనుకున్నాను. రాజధాని రైతుల కన్నీళ్లకు సమాధానంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇది ఏ పార్టీకీ వ్యతిరేకం కాదు. ఇటీవల విడులైన ట్రైలర్‌కి అద్భుత మైన స్పందన వస్తున్నది. సినిమాకు దానికి మించిన స్థాయిలో ఉంటుంది అన్నారు.
ఇది పొలిటికల్ సినిమా కాదని, రైతుల ఆవేదనను తెలిపే సినిమా అని నటుడు వినోద్‌కుమార్ అన్నారు. ఉద్వేగపూరితమైన సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని వాణీవిశ్వనాత్ సంతోషం వెలిబు చ్చారు. రాజధాని రైతులు కూడా ఈ సినిమాలో కనిపిస్తారు. వారి ఆవేదనను ఆవిష్కరించడమే లక్ష్యంగా తీసిన సినిమా ఇది. మాది జాతీయ జెండా లాంటి సినిమా. అందరికీ ఉపయోగపడే సినిమా. ప్రోత్సహించిన నిర్మాతకు కృతజ్ఞతలు అని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర బృందం మాట్లాడారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది.