రాజధాని ఫైల్స్ సినిమా విడుదలపై ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పలు థియేటర్లలో ఈ సినిమా ప్రస్తుతం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. రాజధాని ఫైల్స్ సినిమా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నదని ఈ సినిమా విడుదలను ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు శుక్రవారం వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. అయితే నేడు విచారణ జరిపిన కోర్టు సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించింది. అనంత రం ఈ సినిమాపై కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని స్పష్టం చేసింది. అలాగే చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో రాజధాని ఫైల్స్ చిత్రాన్ని భానుప్రకాశ్ తెరకెక్కించగా, కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో వినోద్‌కుమార్, వాణీ విశ్వనాథ్ నటించారు.