మనోజ్, చాందిని జంటగా నటించిన చిత్రం 14డేస్ లవ్. నాగరాజు బోడెం దర్శకత్వం. హరి బాబు దాసరి నిర్మాత. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ కుటుంబ విలువలను కాపాడే ప్రయత్నంలో ఓ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? ఓ ప్రేమజంట కథకు ఎలాంటి ముగింపు దొరికింది? అనే ఆసక్తి కరమైన అంశాల చుట్టూ కథ నడుస్తుంది. ఫ్యామిలీ, సెంటిమెంట్, వినోదంతో ఆకట్టుకుంటుంది అని చిత్ర బృందం పేర్కొంది. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: కన్నన్ మునుస్వామి, సంగీతం: కిరణ్ వెన్న, మాటలు: గౌరీశ్వర్, శివప్రసాద్ సామల, దర్శకత్వం: నాగరాజు బోడెం.