కంచర్ల ఉపేంద్ర, అపర్ణా దేవి జంటగా నటిస్తున్న చిత్రం 1920 భీమునిపట్నం. నరసింహ నంది తెరకెక్కి స్తున్న ఈ సినిమాని ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్చుతరావు నిర్మిస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వ పోలీసు అధికారి పాత్రలో ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్య్ర సమర యోధుడి కుమార్తె పాత్రలో అపర్ణ కనిపించనుంది. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. తొలి సన్నివేశా నికి కంచర్ల అచ్యుతరావు క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ సీతారాం, సుజాత మధ్య నడిచే ప్రేమకథను దర్శకుడు అద్భుతంగా తయారు చేశారు. 1920 నేపథ్యం కావడంతో ఆనాటి అంశాలను ప్రతి బింబించాల్సిన ఆవశ్యతక ఉండటంతో సంగీతానికి ఇళయరాజను సంప్రదించామని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్వేగాల మేళవింపుతో సినిమాని తెరకెక్కిస్తు న్నాం. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించనున్నామని అన్నారు.