Namaste NRI

22 ఏండ్ల త‌ర్వాత.. క‌లుసుకున్న మ‌న్మ‌థుడు జంట‌

నాగార్జున సినిమాల‌లో ల‌వ్, కామెడీ ఫన్ ఎంటర్‌టైన‌ర్‌ అంటే ముందు గుర్తొచ్చేది మన్మథుడు చిత్రం. త్రివిక్ర‌ మ్ మాట‌లు కే.విజయభాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో 2002 డిసెంబ‌ర్ 20న వ‌చ్చిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సోనాలి బింద్రే, అన్షు స‌గ్గ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా న‌టించారు. అయితే ఈ చిత్రం ద్వారా తెలుగు పరిచయమైంది హీరోయిన్ అన్షు స‌గ్గ‌ర్. మహి అనే పాత్రలో అమాయకంగా కనిపిస్తూనే క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కనిపించేది కాసేపే అయినా కథ మొత్తం ఈ అమ్మడి పాత్ర చుట్టూనే తిరుగు తుంది.ఈ మూవీ తర్వాత అన్షు, ప్రభాస్ నటించిన రాఘవేంద్ర మూవీలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే వ‌రుస‌గా రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ క్యారెక్ట‌ర్ రావ‌డం, ఆ హీరోయిన్ చ‌నిపోవడం వంటివి ఉండ‌డంతో సినిమాలను వదిలేసి ఇంగ్లండ్‌లో సెటిల్ అయ్యింది.

ఇదిలావుంటే తాజాగా ఈ భామ నాగార్జున‌ను క‌లుసుకుంది. ఈ సంద‌ర్భంగా నాగార్జున‌పై స్పెష‌ల్ పోస్ట్ పెట్టింది. రెండు దశాబ్దాల క్రితం మన్మథుడు సినిమాలో నాగార్జున స‌ర్‌తో న‌టించాను. మ‌ళ్లీ ఇన్నేండ్ల త‌ర్వాత ఆయన్ని కలవడం చాలా ఆనందంగా ఉంది, ఆయనలోని మంచితనం, ఉదరత్వం ఇంకా ఇనుమడించాయి. కొన్ని జ్ఞాపకాలు కాలాన్ని మరిపిస్తాయి అంటూ అన్షు రాసుకోచ్చింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events