విజయ్‌శంకర్, మహేష్ యడ్లపల్లి, ఆయూషి పటేల్, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విశాలాక్షి చిత్రం ప్రారంభమైంది. పవన్‌శంకర్ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పల్లపు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్‌నివ్వగా, ఆర్.కె.గౌడ్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకు డు మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కథలో సస్పెన్స్ ఉంటుంది. రాయలసీమ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తం నాలుగు షెడ్యూల్స్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తాం. పాటల ను అరకు, ఊటీలో చిత్రీకరిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఉరుకుందరెడ్డి, సంగీతం: ఆనంద్, రచన-పాటలు-దర్శకత్వం: పవన్ శంకర్.
