Skip to main content

Namaste NRI

ఆస్ట్రేలియాలో వైఎస్ఆర్ వర్ధంతి

దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ వర్ధంతి (సెప్టెంబర్‌ 2న) సందర్భంగా ముందస్తుగా ఘన నివాళులు అర్పించారు ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు. బ్రిస్బేన్‌ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ చిరస్మరణీయుడన్నారు. వైఎస్‌ఆర్‌ చేసిన గొప్ప పనులు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, ముస్తఫా, బియ్యపు మధు సుధన్‌ రెడ్డి, ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్‌ వెంకట్‌ మేడపాలి, చల్లా మధు తదితరులు మాట్లాడారు.

                ఈ కార్యక్రమంలో ఏపీఎన్‌ఆర్‌టీ ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్‌ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, వల్లూరి, బిజివేముల రఘు రెడ్డి, కర్రి శ్రీనివాస్‌, కిషోర్‌, చాగంటి వంశీ, బొమ్మిరెడ్డి జస్వంత్‌, అల్లం యుగంధర్‌ రెడ్డి, కోట శ్రీనివాస్‌ రెడ్డి, కనుబుద్ధి సురేష్‌, గాదె విజయేందర్‌, మందా రామకృష్ణా రెడ్డిలతో పాలు పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events