కార్తికేయ 2తో సూపర్‌హిట్ అందుకున్నారు నిఖిల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ విజయం అందుకుంది. దీనికి కొనసాగింపుగా కార్తికేయ 3 కూడా ఉంటుందని దర్శకుడు అప్పుడే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. ఈ సినిమాకు చెందిన స్క్రిప్ట్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మొదటి రెండు భాగాలను మించే స్థాయిలో ఈ మూడో భాగం ఉండబోతున్నదని, స్పాన్, స్కేల్ పరంగా చాలా బిగ్గర్‌గా ఈ సినిమా ఉండబోతున్నదని చందు మొండేటి నమ్మకంగా చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి.