ఆరు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ సిమోనా హలెప్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆమె 6-4, 7-6 (7/3)తో కమాలియా జార్జి (ఇటలీ)పై నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో హలెప్‌కు గియార్గి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా రెండో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. కానీ టైబ్రేకర్‌లో జోరుగా ఆడిన సిమోనా సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. ఈ పోరులో ఆమె 14 విన్నర్లు కొట్టడంతో పాటు 6 ఏస్‌లు సంధించింది. ముగురుజ కూడా రెండో రౌండ్ చేరింది.
ఈ తొమ్మిదో సీడ్ 7-6 (7/4), 7-6 (7/5)తో వికిచ్ (క్రొయేషియా)ను ఓడిరచింది. కుకోవా (స్లొవేకియా), కలినినా (ఉక్రెయిన్), లెలా ఫెర్నాండెజ్ (కెనడా) తొలి రౌండ్ దాటారు. పురుషుల సింగిల్స్‌లో బాగ్నిస్ (అర్జెంటీనా) రెండో రౌండ్ చేరాడు. తొలి రౌండ్లో అతడు 6-3, 6-3, 6-3తో డానియల్ (కెనడా)ను ఓడిరచాడు.