Namaste NRI

ఆ బాధ నాకు తెలుసు.. అందుకే లంబసింగి నిర్మించా

భారత్‌రాజ్‌, దివి జంటగా నవీన్‌గాంధీ దర్శకత్వంలో కల్యాణ్‌కృష్ణ నిర్మించిన చిత్రం లంబసింగి. ఈ నెల 15న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.  దర్శకుడు కల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ  ప్రతిభ ఉండి కూడా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న చాలామంది యంగ్‌ టాలెంట్‌ని నేను చూశాను. సహాయ దర్శకుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన నాకు దర్శకుడ్ని కావడానికి ఏడేళ్లు పట్టింది. నాగార్జునగారి రూపంలో అదృష్టం నన్ను వరించింది. అందుకే  నాలాంటి దర్శకులకోసం నేను నిర్మాతగా మారాను అని అన్నారు. నమ్మి అవకాశం ఇచ్చిన కల్యాణ్‌కృష్ణగారికీ, సహకరించిన యూనిట్‌సభ్యులకు ధన్య వాదాలని అన్నారు.  కథానాయిక దివి మాట్లాడుతూ  ఒక తెలుగమ్మాయి కావాలని నన్ను ఈ సినిమాకు తీసుకో వడం చాలా సంతోషంగా ఉందని, తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తున్న కల్యాణ్‌కృష్ణగారికి కృతజ్ఞతలని అన్నారు. ఇంకా హీరో భరత్‌రాజ్‌, నటుడు మాధవ్‌ చిలుకూరి, సంగీత దర్శకుడు ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News