విశ్వక్‌సేన్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరి. నేహాశెట్టి కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కృష్ణచైతన్య రచన, దర్శకత్వం. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని మోత అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని యువన్‌శంకర్‌రాజా స్వరపరచగా, ఎం.ఎం.మానసి ఆలపిం చారు. హోలీ పర్వదినాన ఈ పాటను విడుదల చేస్తుండటం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వెలిబుచ్చింది. అందాల తార అయేషాఖాన్, విశ్వక్‌సేన్ తెరను పంచుకున్న ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో అంజలి కీలక పాత్ర పోషిస్తున్నది. మే 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రా నికి సహనిర్మాతలు వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహనిర్మాతలు. కెమెరా: అనిత్ మంధాడి, సమర్పణ: శ్రీకర్ స్టూడియోస్.