అంజలి ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి చిత్రం హారర్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రాన్ని తెరకెక్కించారు. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించారు. అంజలి కెరీర్‌లో 50వ చిత్రమిది కావడం విశేషం. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ను విడుదల చేశారు. హారర్, కామెడీ అంశాల కలబోతగా ట్రైలర్ ఆసాంతం వినోదంతో పాటు ఉత్కంఠను పంచింది. చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ ఓ తెలుగమ్మాయి యాభై సినిమాలు చేయడం చాలా గొప్ప విషయం. అంజలి కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన మూవీ ఇది. ఈ సినిమాకు సాంకేతికంగా మంచి టీమ్ కుదిరింది. ట్రైలర్‌లో చూసింది కొంతే. సినిమా ధమ్ బిర్యానీలా ఉంటుంది అన్నారు.
తొలిభాగం కంటే ఈ సినిమా వందరెట్ల వినోదాన్ని పంచుతుందని, తన కెరీర్‌లో యాభయ్యవ చిత్రం చాలా స్పెషల్‌గా ఉండాలని కోరుకున్నానని, అది ఈ సినిమాతో తీరిందని కథానాయిక అంజలి ఆనందం వ్యక్తం చేసింది. ప్రేక్షకుల్ని ఆద్యంతం నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా తీశామని దర్శకుడు శివ తుర్లపాటి అన్నారు. ఈ సినిమాలో తాను చెనక్కాయల శీను అనే పాత్రలో చక్కటి హాస్యాన్ని పండించానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ: కోన వెంకట్, దర్శకత్వం: శివ తుర్లపాటి.