Namaste NRI

సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ ఆధ్వర్యం లో ఇఫ్తార్ విందు

ముస్లింలకు రంజాన మాసం పవిత్రమైంది.  గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయులు ఇఫ్తార్ విందుల సందడి ఎక్కువైంది.  ఇఫ్తార్ అనేది పూర్తిగా ఇస్లామిక్ సంప్రదాయమైనప్పటికి గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయ ముస్లిమేతరులు కూడా ఇఫ్తార్ విందులో క్రియా శీలకంగా పాల్గొంటూ వసుధైక కుటుంబాన్ని ప్రతిబింబించడం జరుగుతుంది. మలయాళీలు బహిరంగ ప్రదేశాలలో వేలాది మందికి ఇఫ్తార్ విందు భోజనం ఏర్పాట్లు చేస్తుండగా తెలుగు ప్రవాసీ సంఘాలు ఇప్పుడిప్పుడే ఈ దిశగా ముందడుగు వేస్తున్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, ఒమాన్, ఖతర్ దేశాలలో ఇఫ్తార్ విందులను వివిధ తెలుగు ప్రవాసీ సంఘాలు జోరుగా నిర్వహిస్తున్నాయి.

సౌదీ అరేబియా విశాల భౌగోళిక వైశాల్యం దృష్ట్యా విభిన్న నగరాలలో ప్రతి రోజు ఏదో ఒక చోట ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద దేశంలో పెద్ద ప్రవాసీ సంఘమైన సాటా (సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్) ఎర్ర సముద్ర తీరంలోని తబూక్ నుండి ఇటు అరేబియా సముద్ర తీరం అల్ ఖోబర్ వరకు అన్ని ప్రముఖ నగరాలలో ఇఫ్తార్ విందును నిర్వహించగా అందులో హిందువులు క్రీయాశీలక పాత్ర వహించడం విశేషం.

అల్ ఖోబర్‌లో జరిగిన ఇఫ్తార్ విందును కిశోర్, తేజ, గౌరిశంకర్, మక్సూద్, సాదిఖ్‌లతో కూడిన సాటా బృందం నిర్వహించింది. భోజన ఏర్పాట్లను తారక్, శ్రీనివాస్ కొర్రయిలు పర్యవేక్షించారు. ఇఫ్తార్ ఏర్పాట్లను మహిళా మూర్తులయిన భారతీ, ప్రవీణ, సౌజన్య, కుసుమ, కుసుమ రామరాజు, వరిష్ఠిత, సంధ్య భారత్, బిందు సురేశ్, శశీ జగన్, సంతోషినిలు సమన్వయం చేయగా దివ్య పవన్, విజయ కిషోర్, రఫియా మసూద్, సఫియా సుజాలు కూడా తమ వంతు తోడ్పాటునందించారు.

రంజాన్ మాస విశిష్ఠత గురించి మక్సూద్ వివరించారు. తమిళుడైనా తనకు తాను తెలుగువాడిగా సగర్వంగా చెప్పుకొనె అబ్దుల్ మజీద్ బద్రదోద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనివాస్, సైఫుల్లా షరీఫ్, సాదిఖ్ అలీలు కూడా ప్రత్యేక అతిథులుగా హజరయ్యారు. అన్ని రకాల పండుగలను, ప్రముఖ ధార్మికాచారాలను పాటించడం ద్వారా సాటా అందరికీ సమగౌరవం ఇస్తుందని సాటా అధ్యక్షులు మల్లేశన్, ఈశాన్య ప్రాంత శాఖ అధ్యక్షుడు తేజలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events