సుమన్‌తేజ్, గరీమ చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం సీతా కల్యాణ వైభోగమే. సతీష్ పరమవేద దర్శకత్వం. రాచాల యుగంధర్ నిర్మాత. సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిచారు. తన ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతదూరమైనా వెళ్లే యువకుడి కథ ఇది. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా విడుద ల తేదీని త్వరలో ప్రకటిస్తాం అని చిత్ర బృందం పేర్కొంది. నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: పరశురామ్, సంగీతం: చరణ్ అర్జున్, దర్శకుడు: సతీష్ పరమవేద.