జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా డియర్. ఆనంద్ రవి చంద్రన్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి.పృథ్వీరాజ్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి యువ హీరో నాగచైతన్య వాయిస్ ఓవర్ అందించారు. ట్రైలర్‌లో నూతన వధూవరులుగా జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేష్ కనిపించారు. నాగ చైతన్య వాయిస్ ఓవర్ ప్రధానా కర్షణగా నిలిచింది. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్, ఏషియన్ సినిమాస్ విడుదల చేస్తున్నాయి. తమిళం, తెలుగు భాషల్లో వరుసగా ఈ నెల 11, 12వ తేదీల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్ తదితరులు చిత్ర తారాగణం.