వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం శబరి. అనిల్ కాట్జ్ దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. గణేశ్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, వైవా రాఘవ, ప్రభు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇదో స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్. కథ, కథనాలు కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఉంటాయి. వరలక్ష్మీశరత్‌కుమార్ కెరీర్లోనే భిన్నమైన సినిమా అని చెప్పొచ్చు. ఇందు లో ఆమె నటన అద్భుతం అనిపిస్తుంది. తమిళ వెర్షన్ ఫస్ట్‌కాపీ చూశాం. చాలా బావుంది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తయ్యాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే ఈ సినిమాను మే 3న విడుదల చేయనున్నాం అని నిర్మాత చెప్పారు. మే 3న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడిశెట్టి, సంగీతం: గోపీసుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, నిర్మాణం: మహా మూవీస్.