సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం వెట్టయన్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, దగ్గుబాటి రానా మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రావురమేశ్, రోషిణి మొల్లేటి, రితికా సింగ్, దుషార విజయ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తాజాగా వెట్టయన్ విడుదలపై క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సరికొత్త పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. గన్ పట్టుకొని, కళ్లద్దాలతో స్టైలిష్ గా రజనీకాంత్ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. అనిరుథ్ రవిచంద్రన్ స్వరాలందిస్తున్నారు.