జి.వి.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించిన వినోదభరిత కుటుంబకథా చిత్రం డియర్. ఐశ్వర్య రాజేశ్ కథానాయిక. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి.పృథ్వీరాజ్ నిర్మాతలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ వేడుకలో చిత్ర కథానాయకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్ మాట్లాడారు. డియర్ కథను ఐశ్వర్య రాజేశ్ నా దగ్గరకు తెచ్చారు. కథ విన్నప్పుడు, ప్రతి సన్నివేశం రియల్ లైఫ్‌తో రిలేట్ చేసుకునేలా అనిపించింది. ఈ కథ భావోద్వేగాల కలబోత. దర్శకుడు ఆనంద్ కథను అద్భుతంగా మలిచాడు అన్నారు. హీరో సందీప్‌కిషన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకులు వెంకీ అట్లూరి, నందినిరెడ్డి అతిథు లుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. భాష ఏదైనా కంటెంట్ బాగుంటే ఆదరించడంలో తెలుగువారు ముందుంటారు.
అందుకే ఈ సినిమాను కూడా తప్పక ఆదరిస్తారని నా నమ్మకం. నేను తెలుగమ్మాయిని. ఎప్పట్నుంచో తెలుగు లో ఓ స్ట్రయిట్ సినిమా చేయాలనేది నా ఆకాంక్ష. ఇందులో నేను, జీవీ కలిసి నటించిన సీన్లు యూత్‌ని విశేషం గా ఆకట్టుకుంటాయి. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా చూసిన తర్వాత చిరునవ్వుతో బయటి కొస్తారు అని ఐశ్వర్య అన్నారు. గురకపెట్టడం ప్రతి ఇంట్లో ఉండే సమస్యేననీ, దానిపై కథ రాయడం ఎక్సయి టింగ్‌గా అనిపిందనీ, ట్రైలర్‌కి వాయిస్ ఇచ్చిన నాగచైతన్యకు ధన్యవాదాలని దర్శకుడు చెప్పారు. ఇంకా నటి రోహిణి, నిర్మాత త్రిపురనేని వరుణ్, అభిషేక్ రామిశెట్టి కూడా మాట్లాడారు. ఈ నెల 11న తమిళంలో, 12న తెలుగు లో సినిమా విడుదల కానుంది.