Namaste NRI

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి

అమెరికాలో భార‌తీయ విద్యార్థుల మ‌ర‌ణాలు ఆగ‌డం లేదు. కొన్ని వారాల క్రితం క్లేవ్ ల్యాండ్‌లో అదృశ్య‌మైన హైద‌రాబాద్ విద్యార్థి మ‌హ‌మ్మ‌ద్ అబ్దుల్ అర్ఫాత్(25) మృతి చెందాడు. ఈ విష‌యాన్ని న్యూయార్క్‌లోని భార‌త దౌత్య కార్యాల‌యం ప్ర‌క‌టించింది. మేము గ‌త కొంత‌కాలంగా వెతుకుతున్న మ‌హ‌మ్మ‌ద్ అబ్దుల్ అర్ఫాత్ ఓహైయోలోని క్లేవ్‌ల్యాండ్‌లో మృతి చెందాడు. అత‌డి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి. ఈ ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయిలో ద‌ర్యాప్తు చేసేందుకు స్థానిక పోలీసుల‌తో మేం సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాం. మృత‌దేహాన్ని త‌ర‌లించ‌డానికి స‌హాయం చేస్తాం అని పేర్కొంది.

హైద‌రాబాద్‌కు చెందిన అబ్దుల్ గ‌త నెల 7వ తేదీ నుంచి అదృశ్య‌మ‌య్యాడు. అత‌డు క్లేవ్‌ల్యాండ్ విశ్వ‌ విద్యాల‌యం లో ఐటీ మాస్ట‌ర్స్ డిగ్రీ చేస్తున్నాడు. త‌మ‌కు గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని అత‌డి తండ్రి మ‌హ‌మ్మ‌ద్ స‌లీం వెల్ల‌డించారు. వారు 1200 డాల‌ర్లు డిమాండ్ చేస్తున్నార‌ని, ఇవ్వ‌ని ప‌క్షంలో త‌మ కుమారుడి కిడ్నీ విక్ర‌యిస్తామ‌ని హెచ్చ‌రించిన‌ట్లు పేర్కొన్నారు. తాము అంగీక‌రించి, అబ్దుల్ వాళ్ల ఆధీనంలోనే ఉన్న‌ట్లు ఆధారాలు చూపాల‌ని అడిగామ‌న్నారు. దీనికి కిడ్నాప‌ర్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి ఫోన్ పెట్టేశార‌ని తెలిపారు. మ‌ళ్లీ కాల్ చేయ‌లేద‌ని స‌లీం పేర్కొన్నారు. కాక‌పోతే కిడ్నాప‌ర్ మాట్లాడటానికి ముందు ఫోన్‌లో ఎవ‌రిదో ఏడుపు వినిపించింద‌న్నారు. ఆ నంబ‌ర్‌ను అమెరికాలోని త‌మ బంధువుల‌కు పంపి, క్లేవ్ ల్యాండ్ పోలీసుల‌కు అంద‌జేయాల‌ని చెప్పిన‌ట్లు స‌లీం చెప్పారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress