గోపీచంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి విశ్వం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్ స్ట్రైక్ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. పెళ్లి మండపంలోకి వచ్చిన హీరో గోపీచంద్ అక్కడ గన్‌ఫైర్ చేయడం, ఆ తర్వాత భోజనం చేస్తూ దానే దానే పే లిఖా, ఖానే వాలే కా నామ్, ఇస్సే లిఖా మేరే నామ్ అంటూ డైలాగ్ చెప్పడం ఆసక్తిని పెంచింది. గోపీచంద్ స్టైలిష్ లుక్స్‌తో కనిపించారు. ఫస్ట్ స్ట్రైక్ వీడియోను బట్టి ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో సాగనుందని అర్థమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, రచన: గోపీ మోహన్, భాను-నందు, ప్రవీణ్‌వర్మ, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి, దర్శకత్వం: శ్రీను వైట్ల.