Namaste NRI

ప్రధాని పదవి నుంచి వైదొలగనున్న లీ సీన్ లూంగ్

సింగపూర్ ప్రధానిగా దాదాపు రెండు దశాబ్దాలుగా పాలన సాగించిన లీ సీన్ లూంగ్ వచ్చే మే 15న పదవి నుంచి దిగిపోనున్నట్టు ప్రకటించారు. నాయకత్వ మార్పు అనేది ఏ దేశానికైనా అత్యంత ముఖ్యమైన క్షణమని పేర్కొన్నారు. ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్నారు. సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యూ పెద్ద కుమారుడైన లీ సీన్ లూంగ్(72), మూడో ప్రధానిగా 2024 ఆగస్టులో ప్రమాణస్వీకారం చేశారు. 70 ఏళ్లు దాటిన తరువాత పదవి నుంచి వైదొలగుతానని 2012 లోనే ప్రకటించారు.

పాలక పక్షమైన పీపుల్స్ యాక్షన్ పార్టీ రాజకీయ వారసత్వంలో భాగంగా ఇదివరకటి ఉప ప్రధాని హెంగ్ స్వీ కీట్ , తదుపరి పీఎం కావాల్సింది. అయితే తన వయసు (60) ను కారణంగా చూపుతూ 2021లో ఆయన వైదొలి గారు. ఏడాది పాటు సుదీర్ఘ చర్చల తరువాత ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్ (51) ను డిప్యూటీ పీఎం చేశారు. తాను మే 15న ప్రధాని బాధ్యతల నుంచి దిగిపోగానే అదే రోజున లారెన్స్ వాంగ్ తదుపరి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రధాని లీ చెప్పారు. వాంగ్ ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని, ముఖ్యంగా మహ మ్మారి సమయంలో చాలా కష్టపడ్డారని లీ కితాబిచ్చారు. సింగపూర్ ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్త ప్రభుత్వాధి నేతతో కలిసి పనిచేయాలని ప్రజలనుద్దేశించి లీ సూచించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress