Skip to main content

Namaste NRI

వినూత్న కథతో సిల్క్‌ శారీ

వాసుదేవ్‌ రావు, రీవా చౌదరి, ప్రీతీ గోస్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సిల్క్‌ శారీ. టి.నాగేందర్‌ దర్శకుడు. కమలేష్‌ కుమార్‌, రాహుల్‌ అగర్వాల్‌ హరీష్‌ చండక్‌ నిర్మాతలు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. వినూత్నమైన ప్రేమకథా చిత్రమిదని హీరో వాసుదేవ్‌ రావు తెలిపారు. దర్శకుడు మాట్లాడు తూ నిజ జీవితంలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశాను. రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌గా మెప్పిస్తుంది. కథానుగుణంగా చక్కటి టైటిల్‌ కుదిరింది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సనక రాజశేఖర్‌, సంగీతం: వరికుప్పల యాదగిరి.

Social Share Spread Message

Latest News