శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, ప్రభాస్, శరత్‌కుమార్, బ్రహ్మానందం వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్లో ఆయన జాయిన్ అయ్యారు. చిత్ర ప్రధాన తారాగణం పాల్గొన గా కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్ పాత్ర కథాగమనంలో చాలా కీలకంగా ఉంటుంద ని, ఆయన శివుని పాత్రలో కనిపించనున్నారని చెబుతున్నారు. అక్షయ్ కుమార్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిదే కావడం విశేషం.