ఇజ్రాయెల్ సైనిక ఇంటలిజెన్స్ విభాగం అధిపతి అహరన్ హలివా తమ పదవికి రాజీనామా చేశారు. దేశంపై గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన జరిగిన హమాస్ దాడిని నివారించలేకపోయినందుకు నైతిక బాధ్యత తీసుకుం టూ తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముందుగా హమాస్ దాడి గురించి సరైన సమాచారం పసికట్టలేకపోవడం, ఇది తరువాత తమ భూభాగంలో రక్తపాతానికి దారితీయడం వంటి పరిణామాలను పరిగణ నలోకి తీసుకుని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తమ ప్రకటనలో తెలిపారు. హమాస్ దాడి తరువాత ఇజ్రాయెల్ సీనియర్ అధికారి ఒక్కరు రాజీనామాకు దిగడం ఇదే మొదటిసారి అయింది. ఘటనకు తాను బాధ్యత తీసుకుంటున్నానని పేర్కొంటూ హలినా వివరించారు.