పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియే షన్‌కు తాజాగా ప్రభాస్ రూ.35 లక్షల విరాళం ఇచ్చినట్లు టీఎఫ్‌డీఏ అసోసియేషన్ ప్రకటించింది. 2024 మే 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిం దే. టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జన్మదినం (మే 4) సందర్భంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డేని ఈ సారి ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే అగ్ర హీరోలు అందరికి ఆహ్వానం అందింది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు టీఎఫ్‌డీఏ ఆహ్వానం అందించగా, ఫిల్మ్ డైరెక్టర్స్ డే ఘనంగా జరిపించండి అంటూ ప్రభాస్ రూ.35 లక్షల విరాళం ఇచ్చినట్లు అసోసియేషన్ తెలిపింది.