ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే యోచనలో ఉన్న దేశాలు పునరాలోచించుకోవాలని అగ్ర రాజ్యం అమెరికా సూచించింది. లేనిపక్షంలో ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. పాక్ పర్యటనలో ఉన్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాకిస్థాన్ ప్రధాని షెప్‌ాబాజ్ షరీఫ్ చర్చలు జరిపారు. వారి సమక్షంలో ఎనిమిది ఒప్పంద పత్రాలపై ఇరుదేశాల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 1,000 కోట్ల డాలర్లకు చేర్చాలనేది వీటిలో ఒకటి. పాక్‌లో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక దేశాధినేత అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి తాజా హెచ్చరికలు వెలువడ్డాయి.