ఈశాన్య రాష్ట్రం మణిపుర్ లో జాతుల మధ్య ఘర్షణల అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘన లు చోటు చేసుకున్నాయని ఇటీవల అమెరికా ఓ నివేదిక విడుదల చేసింది. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అది పూర్తిగా పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. దానికి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేసింది. మీడియా సమావేశంలో విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఈ అంశా న్ని ప్రస్తావించారు. ఆ నివేదిక పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నది. భారత్ ను ఎంత తప్పుగా అర్థం చేసుకు న్నారో దీంతో అర్థమవుతోంది. దీనికి మేం ఎలాంటి విలువ ఇవ్వడం లేదు. మీరు కూడా ఇవ్వొద్దు అని వ్యాఖ్యానించారు.