లైంగిక నేరారోపణలకు సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తోన్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్ (72)కు ఓ కేసులో ఊరట లభించింది. 2020లో ఇచ్చిన ట్రయల్ కోర్టు తీర్పును న్యూయార్క్ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కొత్తగా మళ్లీ విచారణ మొదలుపెట్టాలని ఆదేశించింది. విచారణలో లోపాలు జరిగినట్లు ఏడుగురు సభ్యుల ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు పేర్కొన్నారు. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో హార్వే వెన్స్టీన్ను న్యూయార్క్ న్యాయస్థానం 2020లో దోషిగా తేల్చింది. ఆ కేసులో ఆయన కు 23 ఏళ్లు శిక్ష పడిరది. అనంతరం మరో అత్యాచారం కేసులో దోషిగా తేల్చిన లాస్ఏంజిల్స్ కోర్టు ఆయనకు అదనంగా మరో 16 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. తాజాగా న్యూయార్క్ కోర్టు ఇచ్చిన తీర్పును అక్కడి అప్పీల్ కోర్టు కొట్టివేసింది.