మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సహ్య. యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భాస్కర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అగ్ర హీరో అర్జున్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడు తూ సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం. కథలోని పౌరాణిక నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది. మహిళ ప్రధాన ఇతివృత్తంతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది’ అన్నారు. త్వరలో టీజర్, ట్రైలర్‌ను విడుద ల చేస్తామని నిర్మాత భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ కోలుగురి, సంగీతం: రోహిత్ జిల్లా, దర్శకత్వం: యాస రాకేష్ రెడ్డి.