దీక్ష కిరణ్‌కుమార్, భవ్యశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం దీక్ష. ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఆర్.కె.గౌడ్ స్వీయ దర్శకత్వం. ముహూర్తపు సన్నివేశానికి ఆర్.కె.గౌడ్ క్లాప్‌నివ్వగా, తూముకుంట నర్సారెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏ పని అయినా విజయవంతమవుతుందనే పాయింట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కి స్తున్నాం. హైదరాబాద్‌తో పాటు దుబాయ్‌లో ఓ షెడ్యూల్ జరుపుతాం. పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది అన్నారు. మంచి కంటెంట్ ఉన్న కథాంశమిదని నాయకానాయికలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.